ఇదంతా వైసీపీ పనే!మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుగుదేశం పైకి నెట్టే ప్రయత్నాన్ని ‘జగన్ మీడియా అండ్ కో’ ప్రయత్నిస్తుండగా, దీనివెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటన్నది టిడిపి నేత ఒకరు సోషల్ మీడియా ద్వారా తెలిపే ప్రయత్నం చేసారు.

2020లో జాతీయ స్థాయిలో ప్రచారం కొరకు వైఎస్ జగన్ సర్కార్ – టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికల నడుమ 8.15 కోట్ల డీల్ కుదుర్చున్న కధనాన్ని తెలిపారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చిరంజీవిపై కధనాన్ని గోపి అనే జర్నలిస్ట్ రాసారు. చిరు – జగన్ ల నడుమ భేటీ జరిగిన రోజు మధ్యాహ్నమే గోపి తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించి, తదుపరి అదే కధనాన్ని పేపర్లో ముద్రించారు.

ఓ వైపు పెట్టుబడులు లేక ఏపీ విలవిలలాడుతుంటే, రాష్ట్రలో 29,781 కోట్లు పెట్టుబడి వచ్చేసిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో గోపి ఓ ప్రత్యేక శీర్షికను అందించారు. దీంతో జగన్ సర్కార్ – గోపి – టైమ్స్ ఆఫ్ ఇండియాల నడుమ ఓ ఒప్పందం జరిగిందన్న కోణంలో ఈ విశేషాలన్నింటినీ ఆధారాలతో సహా రూపొందించి సోషల్ మీడియాలో సదరు టిడిపి అభిమాని పోస్ట్ చేసారు.

ఇవే అంశాలు సాక్షిలో రాసి ఉంటే నేరుగా వైసీపీ మీదకు వస్తుంది గనుక, తమ మానస ఆంగ్ల పత్రిక ద్వారా చిరు విషయాన్ని పక్కదోవ పట్టించారని చెప్తోన్న అంశం లాజికల్ ఉంది. అలాగే ఇంగ్లీష్ పత్రికలో జగన్ ను కొనియాడుతూ వచ్చే శీర్షికలను సాక్షిలో ప్రసారం చేస్తూ… నేషనల్ మీడియా అంతా జగన్ ను అభినందిస్తున్నారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారని చెప్తున్నారు.