SS Thamanటెక్నాలజీ ఎంత పెరిగినా అసలుకి నకిలీకి తేడా పసిగట్టడం అంత సులభం కాదు. పాలలో నీళ్లు కలిపేశాక ఎలాగైతే రెండింటిని వేరు చేయలేమో ట్విట్టర్ లాంటి పబ్లిక్ షాపింగ్ మాల్ లో మంచోళ్ళు పిచ్చోళ్ళు ఎవరని గుర్తించడం అంతకన్నా పెద్ద కష్టం. అందుకే కోట్లాది ఫేక్ ఐడిలతో అర్థం పర్థం లేని బురద జల్లే వ్యవహారం అక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్పేస్ ఆప్షన్ వచ్చాక అపోజిషన్ హీరోలను తిట్టుకునే పనికిమాలిన వ్యవహారాలు ఎక్కువయ్యాయి. వీటివల్ల బోలెడు తలనెప్పి తప్ప పైసా ప్రయోజనం లేదని తెలిసినా కూడా అంతో ఇంతో విచక్షణ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రాప్ లో పడటం విచారకరం.

సరే ఇదంతా అభిమానుల సైడ్. సెలబ్రిటీల వైపుకు వద్దాం. తమన్ అప్పుడప్పుడు ఈ ట్రోలర్స్ బారిన పడుతుంటాడు. ఈ మధ్యే నీకిష్టమైన హీరో ఎవరంటే చాలా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇంటర్వ్యూలలో అందులో నటించిన వాళ్ళకే తాను డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకునే వీడియోలను బయటికి తీసి మరీ కొందరు రాక్షసానందం పొందారు. ఇవాళ మహేష్ బాబు 28 సినిమాలో తన పాటను త్రివిక్రమ్ తిరస్కరించాడనే టాక్ నిజమో కాదో తెలియకుండానే రెక్కలు కట్టుకుని బయటికి వచ్చింది. అంతే మాకు తమన్ వద్దంటూ కొందరు ఫ్యాన్స్ ట్రెండింగ్ స్టార్ట్ చేసేశారు.

వాళ్ళు ఏదైతే కోరుకున్నారో సరిగ్గా తమన్ ఆ ట్రాప్ లో పడిపోయి ఓ కౌంటర్ ట్వీట్ పెట్టాడు. నెగటివిటీకి రెస్ట్ ఇన్ పీస్ చెబుతున్నానని, పిల్లల ఎగతాళికి భయపడేది లేదనే అర్థంలో పెట్టిన సందేశం మరో రచ్చకు దారి తీసింది. అలా అని సమర్థిస్తున్న వాళ్ళు లేకపోలేదు. తమన్ ఫాలోయింగ్ చిన్నది కాదు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కిక్ నుంచి అఖండ దాకా తన ఆల్బమ్స్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. వారసుడు, వీరసింహారెడ్డిలకు బీజీఎమ్ ఎంత హెల్ప్ అయ్యిందో చూశాంగా. సో కొత్తగా తన ప్రతిభ గురించి సర్టిఫికెట్లు ఎవరి నుంచి అవసరం లేదు. సగం ప్యాన్ ఇండియాలకు కంపోజర్ తనే.

అలాంటప్పుడు తమన్ స్పందించకుండా ఉంటేనే బెటర్. పైగా తన మానాన సినిమాలకు పాటలకు సంబందించిన ట్వీట్లు వేసుకుంటూ పోవాలి తప్పించి తన గురించి ఏమనుకుంటున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ఆలోచిస్తే టైం వేస్ట్ తప్ప ఒరిగేది ఏమి లేదు. టార్గెట్ గా పెట్టుకున్న వాళ్ళు ఏం చేసినా ఎగతాళి చేయడం విడిచిపెట్టరు. పట్టించుకోవడం మానేస్తే ఏదో ఒక రోజు అలసట వచ్చి ఆగిపోతారు. తమన్ కేముంది శుభ్రంగా క్రేజీ ప్యాన్ ఇండియాలు చేసుకుంటూ గ్రాఫ్ పెంచుకుంటాడు. సో ఇక్కడ లాభనష్టాలు ఎవరికి అనేది బేరీజు వేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. స్పందన కన్నా సైలెన్స్ సుఖమని వేరే చెప్పాలా.