Is it time for Telugu movies to line up for OTTsసెకండ్ వేవ్ తరువాత ఇంకో పెద్ద సినిమా ఓటీటీలో వస్తుంది. ఇప్పటికే వెంకటేష్ నారప్ప అమెజాన్ లో వచ్చేయగా.. ఈ వినాయక చవితికి నాని టక్ జగదీష్ అదే ప్లాట్ ఫాం లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ వరుసలో టక్ జగదిశే చివరి సినిమానా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లకు సంబంధించిన సమస్య ఐదు నెలల నుండి ఉంది. ఇండస్ట్రీ ఓపెన్ అయ్యి రెండు మూడు నెలలు కావొస్తున్నా ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కి చిత్ర పరిశ్రమకు ఎక్కడ చెడిందో తెలియదు గానీ సమస్య మాత్రం అలాగే ఉంది.

ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద తలకాయలున్నా ముఖ్యమంత్రి అపాయింట్మెమెంట్ కూడా రాని పరిస్థితి. మొన్నా మధ్య అదిగో మీటింగ్ ఇదిగో మీటింగ్ అని వార్తలు వచ్చినా అది కూడా జరగలేదు. అసలు ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఉన్నది సరిపోదు అనుకుంటుంటే కొత్తగా ప్రభుత్వం ఏదో కొత్త వెబ్సైట్ తో సినిమా బిజినెస్ ని చేతుల్లోకి తీసుకుంటుందని ఇంకో వార్త కలవరపెడుతుంది.

ఇప్పుడున్న పరిస్థితి ఇంకో నెలా రెండు నెలలు కొనసాగితే మరిన్ని సినిమాలు ఓటీటీ లకు లైన్ కట్టే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే చాలా సినిమాలకు ఓటీటీ లు ఆఫర్లు పెట్టి టెంప్ట్ చేస్తున్నాయట. మొత్తం ఇండస్ట్రీ అంతా దసరా పండగ నాటికి ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తోంది. అది గనుక జరగకపోతే మొత్తం ట్రేడ్ అంతా కుప్పకూలిపోతుంది. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.