Is it better if the ys jagan bail is canceledజగన్ బెయిల్ రద్దు చెయ్యాలంటూ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు వేసిన పిటిషన్ సిబిఐ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే సిబిఐ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనారోగ్య కారణంగా ఇంకో వాయిదాకు అనుమతిచ్చింది కోర్టు. ఈ నెల 30కు ఈ కేసును వాయిదా వేసింది కోర్టు.

ఇకపోతే జగన్ బెయిల్ రద్దు కావాలనుకోవడం టీడీపీ అభిమానులకు సహజమే. ఏ రాజకీయ అభిమాని అయినా అవతలి వైపు నాయకులకు చేడు జరగాలని కోరుకుకోవడం సహజమే. అయితే ఇప్పుడు జగన్ జైలు కు వెళ్లడం టీడీపీకి మంచిదా? చెడ్డదా?

తెలుగుదేశం పార్టీ అధిష్టానం లెక్కల ప్రకారం… కొన్ని సర్వేల ప్రకారం జగన్ ప్రభుత్వం మీద ఇప్పుడిప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలయ్యింది. కొన్ని నెలల ముందు జరిగిన స్థానిక ఎన్నికల సమయం కంటే ఇప్పుడు ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉందని అంటున్నారు.

పైగా అప్పులు ఎక్కువయ్యి… మునుముందు పథకాలకు మరింత ఇబ్బంది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో జగన్ జైలుకు వెళ్తే ప్రజల మూడ్ ఒక్కసారిగా మారిపోయి.. కొన్ని వర్గాలలో సింపతీ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఎజెండా నే మారిపోయే అవకాశం ఉంది.

అటువంటి సమయంలో జరిగే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారొచ్చు. అయితే జగన్ జైలు కు వెళ్తే తదుపరి సీఎం ఎవరు అనే చర్చ… లేదా కొట్లాట తమకు కలిసి వస్తుందని… ఆ పార్టీ నేతలు కొట్టుకుని ప్రతిపక్షానికి అధికారాన్ని పళ్లెంలో పెట్టి ఇస్తారని కొందరు భావన.

ఈ రకంగా జగన్ బెయిల్ రద్దు అయితే మంచిదా? రద్దు కాకపోతే మంచిదా? అనేదాని పై తెలుగుదేశం పార్టీలోనే భిన్న వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.