is ghani won at box officeకరోనా మహమ్మారి విజృంభన తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినను నిలబెట్టుకోవడానికి మెగా హీరో వరుణ్ తేజ్ ‘గని’ గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. లవర్ బాయ్ గా తొలిప్రేమ., f2 సినిమాలు ఇచ్చిన విజయాలతో ఇప్పుడు బాక్సర్ గా ఆకట్టుకోవడానికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యారు.

అయితే సినిమా విషయానికి వస్తే…, బాక్సింగ్ ఆడుతూ డ్రగ్స్ తో పట్టుబడిన తండ్రికి కొడుకుగా గని కనిపిస్తారు. బాక్సింగ్ టోర్నమెంట్లో గెలవాలనే తన తండ్రి లక్ష్యాన్ని., కలను నెరవేర్చడానికి గని చేసే ప్రయత్నాలే కథా సారాంశం. ఇదే స్టోరీ లైన్ తో గతంలో కొన్ని సినిమాలు విడుదలై మిక్సిడ్ ఫలితాలను పొందాయి.

కధలో కొత్తతనం లేకపోయినా, కథనంలో కొత్తధనం ఉంటే ప్రేక్షకులు సినిమాను ఆదరించడంలో ఎప్పుడు ముందుంటారు. క్రీడా స్పూర్తితో వచ్చే సినిమాలను ఆకర్షణీయంగా.,ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా స్టోరీని రన్ చేయగలగాలి. మొదటి సినిమానే కిరణ్ కొర్రపాటి ఇటువంటి కఠినమైన సబ్జెక్టు ను ఎంచుకోవడం సాహసంతో కూడిన పనే.

ఈ సాహసంలో దర్శకుడు తానూ చెప్పాలనుకున్న కథను చెప్పడంలో విజయం సాధించలేదనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన పావు గంటలోనే సినిమాకు సంబంధించిన అంశాలన్నిటిని ప్రేక్షకుడు తెలుసుకోగలుగుతారు. రొటీన్ కథతో., ఆసక్తి కలిగించలేని కథనంతో సినిమా ఆద్యంతం సాగుతుంది. దర్శకుడు కిరణ్ అనుభవరాహిత్యం ఈ సినిమా మేకింగ్లో స్పష్టంగా కనపడుతుంది.

ఇక వరుణ్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే.., ఈ సినిమాలో వరుణ్ ను రెండు విభిన్న కోణాలలో విశ్లేషించాల్సి వస్తుంది. ఒకటి బాడీ మేకోవర్., మరోది నటన. ఈ రెండిటిలో వరుణ్ కష్టం తెర మీద కనపడుతుంది. ‘బాక్సర్’ గని పాత్రకు తన వంతు న్యాయం చేశారు వరుణ్ తేజ్. భారీ తారాగణంతో గని సినిమా తెరకెక్కింది.

జగపతిబాబు, ఉపేంద్ర, తల్లి పాత్రలో నధియా,సునీల్ శెట్టి,నవీన్ చంద్రా, నరేష్ ఇలా చెప్పుకోదగ్గ నటులెందరో సినిమాకు పని చేసినా..,వారికీ నటనలో అంత అవకాశమున్న పాత్రలు లేవు. ‘సాయి మజ్రేకర్’ గని సినిమాతో హీరోహిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కథానాయకి పాత్రకే పరిమితమయ్యారు.

తమన్ తన మ్యూజిక్ తో సినిమాలో రీసౌండ్స్ సృష్టించారు. మొత్తంమీద గని భారీ తారాగణంతో మరియు నిర్మాణ విలువలతో విడుదలైన క్రీడా చిత్రం. కొత్తదనం లేని కధ., కథనాలతో తెరకెక్కిన మెగా హీరో సినిమా గని.మరి ప్రేక్షకులు,మెగా అభిమానులు గని తో వరుణ్ ని గట్టెక్కిస్తారా?