Is Chiranjeevi still in touch with Jaganతెలుగు చలన చిత్ర పరిశ్రమ తనను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటి నుండో గుర్రుగా ఉన్నారు. ఇండస్ట్రీ నుండి ముందుగా చిరంజీవి వెళ్లి జగన్ ని కలిసొచ్చారు. అడగకుండానే మూడు రాజధానులకు బహిరంగ మద్దతు ఇచ్చారు.

అయితే వకీల్ సాబ్ మొదలు పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. తమ్ముడి సినిమా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని చిరంజీవి మొన్న ఆ మధ్య జగన్ అప్పాయింట్మెంట్ ఇస్తా అనగానే మీటింగ్లు పెట్టి హడావిడి చేశారు.

అయితే ఆ అప్పాయింట్మెంట్ రద్దు కావడం… సీఎం పరిశ్రమను అనేక రకాలుగా అవమానించడం… పవన్ కళ్యాణ్ ని తిడుతున్నా పట్టించుకోకపోవడంతో చిరంజీవి మీద విమర్శలు వచ్చాయి. అయితే చిరంజీవి మనుషులు మాత్రం ఆయన ఈ విషయానికి దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీలో చెబుతున్నారు.

అయితే విమర్శలను తప్పించుకోవడానికే చిరంజీవి అలా చెప్పిస్తున్నారని… నిజానికి ఆయన జగన్ తో టచ్ లోనే ఉన్నారని కొందరి వాదన. వివరాల్లోకి వెళ్తే… మా ఎన్నికలతో మాకు సంబంధం లేదనీ, ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

జగన్ తో ఉన్న బంధుత్వం కారణంగా… అలాగే మోహన్ బాబు 2019లో చేసిన ప్రచారం కారణంగా మా ఎన్నికలలో విష్ణు జగన్ పేరు వాడుకుని ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తున్నారని చిరంజీవి ప్రభుత్వం తో ఈ ప్రకటన ఇప్పించారని ఇండస్ట్రీలో గుసగుస. ఈ ఎన్నికలలో చిరంజీవి ప్రకాష్ రాజ్ కు పరోక్షంగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.