is Amar raja group moving tamilnaduఆంధ్రప్రదేశ్ లో తొలితరం పెట్టుబడి, అమరరాజా… వచ్చి రెండు దశాబ్దాలు దాటినా రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అతిపెద్ద పెట్టుబడి. ఉపాధి కల్పనలో కూడా అమరరాజాకు దగ్గరలో ఉన్న కంపెనీలు పెద్దగా లేవనే చెప్పుకోవాలి.

అటువంటి కంపెనీ తమిళనాడుకు తరలిపోతోంది అనే వార్తలు వస్తున్నాయి. సహజంగా ఏ రాష్ట్రమైన ఉలిక్కిపడి ఆపే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం… “వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వమే పొమ్మంటోంది” అంటూ ప్రకటించేసింది.

ప్రజారోగ్యానికి హానీ కలిగించే రసాయనాలు ఆ కంపెనీ ప్లాంట్ నుండి వెలువడుతున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చేతికి చిన్న పుండయితే మందు రాయాలి… అవసరమైతే శస్త్రచికిత్స చేసుకోవాలి కానీ చేతిని నరికేసుకోరు కదా?

నిజంగా అమరరాజా తో సమస్య ఉంటే దానికి పరిష్కారం చూడాలి… ప్రపంచంలో కాలుష్యాన్ని ఆపే టెక్నాలజీ లేదా? ఒక పరిశ్రమ కాలుష్యం (నిజంగా ఉంటే) పరిష్కరించలేని సమస్యా? ఎన్ని వేల ప్రత్యక్ష ఉద్యోగాలు? ఎన్ని వేల పరోక్ష ఉద్యోగాలు?

ఈ అంకెలు ఎన్నో జీవితాలు… ఎన్నో కుటుంబాల జీవన ఉపాధి గురించి కదా? ఎంత వ్యాపారం? ఎన్ని పన్నులు? ఎంత ఆదాయం? రాష్ట్రం వీటిని వదులుకునే పరిస్థితిలో ఉందా? అమరరాజా యాజమాన్యం టీడీపీ వారు… కమ్మ కులస్థులు… అనే విషయం పక్కన పెడితే పరిష్కారం ఈజీగా కనబడుతుంది. దాదాపుగా 20,000 కుటుంబాల జీవితాలకు సంబంధించిన విషయం ఇది.