Irrfan Khan Angrezi Medium release on Hotstar ఇర్ఫాన్ ఖాన్ మరియు కరీనా కపూర్ నటించిన అంగ్రేజీ మీడియం మార్చి 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా థియేటర్లను మూసివేస్తున్నట్లు చాలా రాష్ట్రాలు ప్రకటించినందున దాని థియేట్రికల్ రన్ ముందుకు జరగలేదు. ఆపై, దేశం మొత్తం మార్చి 22 నుండి లాక్డౌన్ కింద ఉంది.

దీనితో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తిగా ఆగిపోయింది. దీనితో ఇప్పుడు ఆ చిత్రం మేకర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడు హాట్‌స్టార్‌లో విడుదల చేశారు. అలాగే అదే రోజున విడుదలైన మరో తెలుగు చిత్రం మదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 8న విడుదల కానుంది. రెండు చిత్రాలకు డీసెంట్ రివ్యూలు మరియు టాక్ వచ్చాయి

కానీ దురదృష్టవశాత్తు థియేటర్లలో బాగా రాణించలేదు. థియేటర్లలో విడుదల చేయలేని అనేక చిన్న సినిమాలు ఏదో ఒకవిధంగా కొన్ని డబ్బులైన రాబట్టుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవలే షూట్ ఎట్ సైట్ అనే తమిళ డబ్బింగ్ సినిమా అసలు థియేటర్లలో విడుదల కాకుండా అమెజాన్ లో వచ్చేసింది.

లొక్డౌన్ పూర్తయిన తరువాత వరుసగా పెద్ద, మీడియం సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. చిన్న, డబ్బింగ్ సినిమాలకు అవకాశాలు తక్కువ. దానితో వారు సినిమాలకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెంచుకోకుండా డైరెక్టుగా డిజిటల్ లో విడుదల చేసి ఎంతో కొంత సంపాదించడానికి మొగ్గు చూపుతున్నారు.