YS Jagan and ministers no maskస్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బీఏసి సమావేశం జరిగింది. సమావేశం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎపి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. డిసెంబర్ నాలుగో తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలలో 19 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

మరో వైపు.. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అధికార పక్షం తరపున హాజరయ్యారు. ప్రతిపక్షం తరపున టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాత్రానే హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో ను ప్రభుత్వం విడుదల చేసింది.

ఫోటోలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు మాస్క్ పెట్టుకోలేదు. స్పీకర్ కూడా మాస్క్ పెట్టుకోలేదు. సోషల్ డిస్టెంసింగ్ ని పాటించకుండా సీటింగ్ ఎరేంజ్ చేశారు. అధికార పక్షానికి కనీస బాధ్యత ఉండక్కర్లేదు… ఇటువంటి నిర్లక్ష్య ధోరణితో ప్రజలకు ఏమని మెస్సేజ్ ఇస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

అయితే మాస్క్ లేకుండా సంచరించటం ముఖ్యమంత్రి జగన్ కు కొత్తేమీ కాదు. తరచుగా ఈ విషయంగా ఆయన విమర్శల పాలవుతారు. విమర్శలు వచ్చినా ఆయన తన పంథా మార్చుకోరు. అయితే ఈ ధోరణి వల్ల చాలా మంది పాల్గొనే శాసనసభ సమావేశాల్లో కరోనా ప్రబలకుండా ఉంటే అదే చాలు.