IPL---CSK-vs-SRHఆదివారం నాడు ఐపీఎల్ ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్ పోరుకు కేన్ విలియమ్స్ ఆధ్వర్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ సీజన్ లో ఇప్పటికి మూడు సార్లు ఇరు జట్లు తలపడగా, మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఫైనల్లో రివేంజ్ తీర్చుకుని రెండవ సారి కప్ కైవసం చేసుకోవాలని సన్ రైజర్స్ జట్టు ఊవ్విళ్ళూరుతోంది.

అభిమానులు అంచనా వేసినట్లుగా సన్ రైజర్స్ విజయం సాధిస్తే… ఈ సీజన్ లో నాన్ ఇండియన్ కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక టీం హైదరాబాద్ కప్ గెలిచినట్లవుతుంది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క హైదరాబాద్ మినహాయిస్తే, అన్నీ జట్లకు ఇండియన్ ప్లేయర్లు మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించారు. సన్ రైజర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన్ కేన్ విలియమ్స్ జట్టును ముందుండి నడిపించడంలో సక్సెస్ కాగా, విదేశీ కెప్టెన్లు హైదరాబాద్ కు కలిసి వస్తుండడం అసలు విషయం.

గతంలో దక్కన్ ఛార్జర్స్ కు గిల్ క్రిష్ట్ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఓ సారి కప్ ను కొల్లగొట్టిన హైదరాబాద్, డేవిడ్ వార్నర్ నేతృత్వంలో కూడా మరోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సారి విదేశీ కెప్టెన్ అయిన కేన్ విలియమ్స్ కూడా తమకు కప్ తీసుకువస్తాడని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆశిస్తున్నారు. ఫైనల్ జరగబోయే ప్రదేశం ముంబై వాంఖేడే వేదిక కావడంతో, ప్రేక్షకుల నుండి దాదాపుగా ఇరు జట్లకు ఒకే విధమైన సహకారం లభించవచ్చు.