Mumbai Indians beat Kings XI Punjabప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పై చివరి క్షణంలో విజయం సాధించి ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోయినట్లయితే ఆ ప్రభావం ముంబై పైనే కాక, ఇతర జట్ల మీద కూడా ఉన్న నేపధ్యంలో… ప్రస్తుత విజయం టేబుల్ ను మరింత ఉత్కంఠభరితంగా మార్చేసింది.

ఈ విజయంతో ముంబై ఏకంగా మరోసారి టాప్ 4లోకి ఎంటర్ కాగా, నెట్ రన్ రేట్ విభాగంలో వెనుకబడిన రాజస్తాన్, పంజాబ్ జట్లు ముంబైను ఫాలో అవుతున్నాయి. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే బెంగుళూరు ముంబైని వెనక్కి నెట్టి నెట్ రన్ రేట్ ద్వారా టాప్ 4లోకి ప్రవేశించే ఆస్కారం ఉంది.

ఇంతకీ ముంబై ఎలా విజయం సాధించింది అంటారా? 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కోల్పోయి 145 పరుగులు చేసింది. అంటే విజయానికి 4 ఓవర్లలో కేవలం 42 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా, చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఎక్కడైనా విజయం బ్యాటింగ్ జట్టుకే ఉంటుంది, అయితే ఐపీఎల్ లో అద్భుతాలు జరుగుతాయి గనుక, ఫైనల్ గా ముంబై విజయం సాధించింది.