IPL 2018 - Finalగత 40 రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఊర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్ లకు నేటితో శుభంకార్డు పడనున్న నేపధ్యంలో… టాప్ 4లో ఒక స్థానం ఇంకా భర్తీ కాకపోవడంతో, ఏ జట్టు ఆ నాలుగవ స్థానం ఆక్రమిస్తుందోనని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క స్థానం కోసం రాజస్తాన్, ముంబై, పంజాబ్ జట్లు పోటీ పడుతుండగా, ఇందులో రాజస్తాన్ జట్టు ఇప్పటికే 14 పాయింట్లతో టాప్ 4గా ఉంది.

అయితే నేడు ముంబై – ఢిల్లీ జట్ల మధ్య జరగనున్న సాయంత్రపు మ్యాచ్ లో ముంబై గనుక విజయం సాధిస్తే… నెట్ రన్ రేట్ రీత్యా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. అలాగే చెన్నై – పంజాబ్ జట్ల మధ్య జరిగే రెండవ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. చెన్నైను భారీ తేడాతో ఓడించడం గానీ లేక లక్ష్యాన్ని స్వల్ప వ్యవధిలో అందుకోవడం గానీ చేయగలిగితేనే పంజాబ్ కు అవకాశం లభిస్తుంది. దీంతో అందరి చూపులు ముంబై – ఢిల్లీ మధ్య జరగనున్న మ్యాచ్ పైనే ఉన్నాయి.

గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టు, ఈ సీజన్ లో తొలుత వరుస పరాజయాలను చవిచూడగా, సెకండాఫ్ లో మెరుగైన ఆటతీరుతో రాణించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్ లో పాయింట్ పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ తన చివరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి జలక్ ఇచ్చింది. అదే వరుసలో ముంబైకు కూడా షాక్ ఇస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.IPL 2018 Points table