ipl 2017 rising-pune-supergiant-Vs mumbai-indiansipl 2017 rising-pune-supergiant-Vs mumbai-indiansఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ల హంగామా ముగిసింది. ఆదివారం నాడు జరిగిన కీలక మ్యాచ్ లో పంజాబ్ ను అవలీలగా మట్టి కరిపించిన పూణే జట్టు ఏకంగా నెంబర్ 2 స్పాట్ ను కైవసం చేసుకుని ముంబై ఇండియన్స్ తో అమీతుమీకి సిద్ధమవుతోంది. తొలి రెండు స్థానాల్లో ముంబై, పూణే జట్లు నిలవగా, మూడవ స్థానంలో హైదరాబాద్ జట్టు నాలుగవ ఉన్న కోల్ కతాను డీ కొట్టనుంది. తొలి క్వాలిఫైయర్ ముంబై – పూణే జట్ల మధ్య మంగళవారం నాడు జరగనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ హైదరాబాద్ – కోల్ కతాల మధ్య బుధవారం నాడు జరగనుంది.

అయితే తొలి క్వాలిఫైయర్ లో తలపడనున్న ముంబై – పూణేల మధ్య రెండు లీగ్ మ్యాచ్ లు జరుగగా, రెండింటిలోనూ ముంబైను మట్టికరిపించింది పూణే. దీంతో స్టీవ్ స్మిత్ సారధ్యంలోని రైజింగ్ జైంట్స్ పై రివేంజ్ తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ముంబైకు అండగా ఉన్న సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలోని జట్టు ఈ ఏడాది విశేషంగా రాణించింది. ఒక్క పూణే తప్ప మిగతా జట్లపై కనీసం ఒక్కసారైనా విజయం సాధించిన ముంబై, ఆ ముచ్చట కూడా తీర్చుకోవడానికి తొలి క్వాలిఫైయర్ రూపంలో అవకాశం లభించింది.

ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ కు చేరుకుంటారు. అలా కాకుండా ఓటమి పాలయితే మాత్రం ‘ఎలిమినేటర్’ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో ఆడే అవకాశం లభిస్తుంది. అయితే బరిలో ఉన్న నాలుగు జట్లలో ముంబై, హైదరాబాద్, కోల్ కతా జట్లు ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ ను సగర్వంగా రెండేసి సార్లు ఎత్తుకోగా, రైజింగ్ జైంట్స్ పూణేకు మాత్రం ఆ అవకాశం లభించలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి ఆ కలను సాకారం చేసుకునే వ్యూహాలలో నిమగ్నమై ఉంది.