intlo-deyyam-nakem-bhayam-movieపక్కా సక్సెస్ కావాల్సిన అల్లరి నరేష్, తాజాగా “ఇంట్లో దెయ్యం నాకేం భయం” అనే సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే “అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో” వంటి పెద్ద హీరోల చిత్రాలను నిర్మించిన బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత కావడంతో, ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఓ నమ్మకం ఏర్పడింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, వీడియో విడుదల తేదీల ప్రకటన వచ్చింది. అక్టోబర్ 28వ తేదీన “ఇంట్లో దెయ్యం నాకేం భయం” ఆడియో విడుదల చేయనుండగా, నవంబర్ 11వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఇటీవల కాలంలో హార్రర్ సినిమాకు ప్రేక్షకులకు పట్టం కడుతుండడం మరియు నవంబర్ మాసంలో పెద్ద హీరోల సినిమాలేవి లేకపోవడం అల్లరోడుకు కలిసొచ్చే అంశాలు. మరి ఇన్ని కలిసి వస్తున్నా, ఆ కావాల్సిన ఒక్క సూపర్ సక్సెస్ లభిస్తుందో లేదో వేచిచూడాలి.