Intelligence dg ab venkateswara rao ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిచి పెట్టేయాలని భావించి ఆయనని బదిలీ చేసింది. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం ఐపీఎస్‌ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తరువాత దీనిపై సుప్రీం కోర్టు కు వెళ్లదామని ప్రభుత్వం తొలుత భావించింది.

అయితే ఎన్నికల సమయంలో ఇటువంటి అనవసరమైన టైమ్ వేస్ట్ అని భావించి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఐబీ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసీ తీరుపై మండిపడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధులతో ఐబీ చీఫ్‌కు సంబంధం లేదని పేర్కొంటూ ఆయన బదిలీని నిలుపుదల చేసింది. వైకాపాకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు వాదన.

మరోవైపు ఇది తమ విజయంగా భావించి డీజీపీ ఆర్ఫీ ఠాకూర్ ను కూడా బదిలీ చెయ్యాలని ఎన్నికల సంఘం పై ఒత్తిడి చేస్తుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఒక బృందం ఈసీని కలిసి దీనిపై కంప్లయింట్ చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు పార్టీలు ఈ ఎన్నికలు తమకు చావోరేవో అన్నట్టు భావించి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.