Instead of IPC sections YCP sections in APఏపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈరోజు ఆయన ను సీఐడీ కోర్టు ముందు హాజరు పరచిన సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన పై సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ గాయాలు కోర్టుకు చూపించారు. ఆ తరువాత ఇదే అంశంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ని కూడా ఆశ్రయించారు.

అయితే దీనిపై అటు సీఐడీ కోర్టు, ఇటు హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రఘురామ ఒంటి మీద గాయాలు పోలీసులు కొట్టడం వల్లే వచ్చాయి అని తేలితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. దీనిపై టీడీపీ జనరల్ సెక్రటరీ, నారా లోకేష్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అమ‌లుచేయాల్సిన పోలీసులు జగన్ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా అరాచ‌కాల‌కు తెగ‌బ‌డుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజుకే ఈ దుస్థితి అయితే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షం, ప్ర‌జ‌ల‌కి ఇంకెక్క‌డి ర‌క్ష‌ణ‌? పీలో ఐపీసీ సెక్ష‌న్ల బ‌దులు వైసీపీ సెక్ష‌న్లు అమ‌ల‌వుతున్నాయి,” అంటూ విరుచుకుపడ్డారు.

“ఏపీలో అరాచ‌క‌పాల‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్ర‌ప‌తి, లోక్ స‌భ స్పీక‌ర్‌, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ స‌త్వ‌ర‌మే స్పందించాలి. కేంద్ర‌ బృందాల‌తో న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలి. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి,” అంటూ డిమాండ్ చేశారు. ఇది అలా ఉండగా…. రఘు రామను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తరువాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని కోర్టు ఆదేశించింది. ఆయన గాయాలను నిర్దారించడానికి కోర్టు నియమించిన మెడికల్ బోర్డు రేపు ఆయనను కలుస్తుంది.