Supreme-Court-Raps-the-Center-for-Non-Implementation-of-Bifurcation-Promisesఆగష్టు 1 నుండి అన్ని సినిమా థియేటర్లలోనూ ఎమ్మార్ఫీ ధరలకే తినుబండారాలు శీతలపానీయాల అమ్మాలని తెలంగాణ తూనికలు కొలతల శాఖ ఉత్తరువులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ శాఖ పీవీఆర్ కు చెందిన థియేటర్ల పై దాడులు చేసి కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హై కోర్టు చిత్రమైన ఉత్తరువులు ఇచ్చింది.

కాచిగూడ ఐనాక్స్, జీవీకేకు హైకోర్టులో ఊరట లభించింది. కొద్దిరోజులుగా తూనికలు, కొలతల శాఖ అధికారులు నిబంధనలు పాటించని మల్టీప్లెక్స్ థియేటర్లపై వరుస దాడులు చేస్తూ.. కేసులు నమోదుచేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారనే పేరుతో బిల్లింగ్ మిషిన్లను, ఇతర వస్తువులను పలు థియేటర్లలో స్వాధీనం చేసుకున్నారని ఆ థియేటర్లు ఆరోపించాయి.

వాదనలు విన్న ధర్మాసనం.. ఐనాక్స, జీవీకేలో తనిఖీలు చేయొద్దని తూనికలు కొలతల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. హై కోర్టు జారీ చేసిన ఈ ఉత్తరువులు చాలా చిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అయ్యింది. ఇప్పుడు ఆ థియేటర్లు దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తాయి.