Indian-Premier-League,-2018-Pointsగత నెల రోజులుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ దాదాపుగా తుది దశకు చేరుకుంటోంది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్ కు అర్హతను పొందుతాయి. ఈ నాలుగింటిలో రెండు జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టాప్ 2లో నిలిచాయి. మిగిలిన రెండు స్థానాల కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కథా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

అలాగే తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకునేందుకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కూడా బరిలో ఉండగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మాత్రం ఇప్పటికే టోర్నీ నుండి అవుట్ అయ్యింది. ఆదివారం నాడు జరిగిన రెండు కీలకమైన మ్యాచ్ లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ తమ బెర్త్ ను ధృవీకరించుకోగా, ముంబైపై అనూహ్య విజయాన్ని సాధించిన రాజస్తాన్ రాయల్స్ 12 పాయింట్లు సాధించి మరో అడుగు ముందుకేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేవలం 168 పరుగులు మాత్రమే చేయగా, ఆ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 18 ఓవర్లలోనే పూర్తి చేసింది. మరోసారి బట్లర్ అజేయమైన 94 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో తమ అవకాశాలను ముంబై క్లిష్టతరం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచినా, ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే ఇతర మ్యాచ్ లపై ఆధారపడాల్సిన పరిస్థితి ముంబైది. ఇదిలా ఉంటే ఇక మిగిలిన 8 లీగ్ మ్యాచ్ లు ప్రతి జట్టుకు దాదాపుగా కీలకమైన మ్యాచ్ లే!