indian navy wife-swapping-scandalవింత పోకడలు పోతున్న ఈ ‘హైటెక్’ సమాజంలో తాజాగా నేవీలో వెలుగుచూసిన సంఘటనపై సుప్రీంకోర్టు విస్మయాన్ని వ్యక్తపరిచింది. కొచ్చి సైనిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి భార్య ద్వారా వెలుగు చూసిన ఈ ఉదంతం మొత్తం నేవీకే చెడ్డ పేరును తీసుకువచ్చింది. ఇక, ముందు నేవీలో చేరాలనుకునే భావితరం పౌరులను ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకునేలా చేస్తోంది.

కొచ్చి సైనిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి భార్యను ఉన్నతాధికారి తన వద్దకు పంపించాలని కోరగా, అందుకు ఆ ఉద్యోగి అంగీకరించకపోవడంతో, సదరు సీనియర్ అధికారి ఆ ఉద్యోగిని బెదిరించడంతో, బయటకు వచ్చిన కమాండర్ భార్య ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది కాస్త బహిర్గతం కావడంతో, అప్పటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ ప్రభావితం ఏ మాత్రం కనపడకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం… కేసులో విషయాలు తెలుసుకుని అవాక్కయ్యి… ‘ఇదేం సంస్కృతి…’ అంటూ మండిపడింది. నేవీలో ఉన్నత స్థాయి అధికారులు సరదా కోసం భార్యలను మార్చుకుని శృంగారానందం పొందుతారట. ఇదే సంస్కృతిని జూనియర్లకు పరిచయం చేస్తారట. దీనికి అంతా అంగీకరించాల్సిందే… లేని పక్షంలో వేధింపులను భరించాల్సిందేనని డిఫెన్స్ కు చెందిన పలువురు పేర్కొంటుంటారు. దీంతో ఈ కేసును విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కొచ్చిలో నావికాధికారులు భార్యల మార్పిడీ శృంగారంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించింది.