ఒకప్పుడు వెండితెర పైన ప్రదర్శించే ముద్దుగుమ్మల అందచందాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. ఫాలోయర్స్ ను పెంచుకునే క్రమంలో హీరోయిన్లు చేస్తోన్న ఫీట్స్ లో బికినీ ట్రీట్ ఒకటి. ప్రస్తుతం బికినీలో సోయగాలను ప్రదర్శించడానికి ముద్దుగుమ్మలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.
మంగళవారం నాడు అయితే ఏకంగా ముగ్గురు బ్యూటీలు తమ బికినీ ట్రీట్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసారు. బికినీ ధరించడానికి పర్ ఫెక్ట్ బాడీగా బాలీవుడ్ జనుల చేత నీరాజనాలు అందుకుంటున్న కియారా అద్వానీ పింక్ కలర్ బికినీతో పడేయగా, టాలీవుడ్ ను ఏలుతోన్న పూజా హెగ్డే తానేం తక్కువ కాదంటూ వైట్ బికినిలో తళుక్కుమంది.
ఇక సినిమా తక్కువ సోయగాలు ఎక్కువ అన్న రీతిలో హాట్ పిక్స్ ను సోషల్ మీడియాకు ఎక్కించే పనిలో ఉన్న అతిలోక సుందరి కుమార్తె జాహ్నవి కపూర్, పసుపు రంగు బికినీ ధరించి నెటిజన్లను ఫిదా చేసింది. సహజంగా వీకెండ్ లో ఎప్పుడూ ఇలాంటి పిక్స్ ను వదులుతుంటారు. కానీ ఈ సారి అందుకు విరుద్ధంగా ఈ ముగ్గురు ఒకే రోజు పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యాయి.
NTR Arts: Terrified NTR Fans Can Relax!
You’re Good for Only Exposing: Actress Responds