India Women status in a picబ్రిటిషర్ల నుండి పోరాడి సంపాదించుకున్న ఈ స్వాతంత్ర్య భారతావని ప్రస్తుతం ఎలా ఉంది అంటే… ఖచ్చితంగా ఈ ఫోటోకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. అవును… ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని… నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని… అని పాడుకోవాల్సిన ఈ భరత ఖండంపై, ప్రస్తుతం స్త్రీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఎంతగా అంటే… ఇండియా పర్యటించాలంటే విదేశీయులు భయపడిపోయేటంతగా..!

మహిళపై అత్యాచారం లేని రోజు లేదని “సగర్వంగా” చెప్పేటంత అభివృద్ధి ఈ 70 ఏళ్ళల్లో సాధించింది. అందుకే ఈ ఫోటోకు నెటిజన్లు, మహిళాలోకం నీరాజనాలు పడుతున్నారు. ఈ ఫోటోను గీసిన వ్యక్తి మహిళో, పురుషుడో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ పెయింటింగ్ కు ప్రశంసల జల్లు కురుస్తోంది.