India vs West Indies t20 world cup match  virat kohli big score againవిరాట్ కోహ్లి… ఈ పేరు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ అభిమానులను ఊపేస్తోంది… అలాగే ప్రపంచ బౌలర్లకు నిద్ర పట్టనివ్వకుండా కూడా చేస్తోంది. ఆ అనుభవమే సెమీ ఫైనల్లో వెస్టీండీస్ బౌలర్లకు ఎదురయ్యింది. కోహ్లి కొట్టే షాట్లకు మైదానంలో అభిమానులు కేరింతలు కొడుతుంటే… ఆ షాట్లను చూసి… ఎలా కొడుతున్నాడు అని అవాక్కవ్వడం విండీస్ బౌలర్ల వంతయ్యింది.

గేల్ మాదిరి విరుచుకుపడే షాట్లు కావు… ధోని మాదిరి బలంగా కొట్టేవి కావు… అయినా బంతులు బౌండరీలు దాటుతూనే ఉన్నాయి. కోహ్లి కొట్టిన కొన్ని షాట్లకు అయితే కామెంటరీ చెప్తున్న వారు సైతం అవాక్కయ్యారు. నిజం… ఇది నిజంగా నిజం… కోహ్లి వంటి బ్యాట్స్ మెన్ ప్రస్తుత తరంలో లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే… ప్రపంచం చవిచూసిన అతి కొద్ది మంది గొప్ప బ్యాట్స్ మెన్ల జాబితాలో కోహ్లి పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి.

విండీస్ బౌలర్లు వేసే స్లో బంతులను అర్ధం చేసుకుని, ఇరగ్గొట్టడం బహుశా కోహ్లికి సాధ్యమైనంతగా మరొకరికి సాధ్యం కాలేదేమో అని చెప్పాలి. 47 బంతులను ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 89 పరుగులతో అజేయంగా నిలిచారు. కోహ్లి చెలరేగడంతో భారత్ 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక టీమిండియాను గెలిపించాల్సిన బాధ్యత బౌలర్ల వంతు..!