India vs Sri Lanka, Gale Test 2017గాలే వేదికగా ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 600 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. తొలి రోజు శిఖర్ ధావన్ దూకుడైన ఇన్నింగ్స్, చటేశ్వర పుజారాల నిలకడైన బ్యాటింగ్ తో భారీ స్కోర్ కు బాటలు వేసిన టీమిండియా, రెండవ రోజు మాత్రం తడబడింది. దీంతో ఒకానొక దశలో 500 పరుగులకే చాప చుట్టేస్తుందని భావించినప్పటికీ, చివర్లో హార్దిక్ పాండ్య – షమీల జోడి 600 పరుగుల మైలురాయిని అందుకునేలా చేసింది.

ఇంత భారీ స్కోర్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి సహకారం ఎంత? అంటే కేవలం 3 పరుగులు మాత్రమే. టీమిండియా ఎప్పుడు ఆపదలో ఉన్నా బ్యాట్ ఝుళుపించే కోహ్లి, ఈ బ్యాటింగ్ పిచ్ పై మాత్రం కేవలం 3 పరుగులు మాత్రమే నమోదు చేసాడు. విశేషం ఏమిటంటే… టీమిండియాలో లోయెస్ట్ స్కోర్ కూడా కోహ్లిదే. అలాగే మొత్తం 11 మంది బ్యాట్స్ మెన్లలో కూడా సింగిల్ డిజిట్ స్కోర్ సాధించిన ఘనత కూడా విరాట్ కోహ్లిదే కావడం విశేషం. అయితే విరాట్ బ్యాటింగ్ ప్రతిభ లేకుండా టీమిండియా 600 పరుగుల స్కోర్ ను నమోదు చేయడం విశేషం.

శిఖర్ ధావన్ 190, అభినవ్ ముకుంద్ 12, పుజారా 153, కోహ్లి 3, రెహానే 57, అశ్విన్ 47, సాహా 16, హార్దిక్ పాండ్య 50, జడేజా 15, షమీ 30, ఉమేష్ యాదవ్ 11 పరుగులు చేసారు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పాండ్య హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం. ఇక భారీ ఇన్నింగ్స్ లక్ష్య చేధనలో ఆదిలోనే ఓ వికెట్ కోల్పోయింది లంక జట్టు. ఉమేష్ యాదవ్ వేసిన బంతికి కరుణరత్నే (2) ఎల్ బిడబ్ల్యుగా వెనుదిరగడంతో తొలి వికెట్ కోల్పోయి ఎదురీదుతోంది.