India-vs-England,-3rd-Test-Bumrah-wreaksఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న అయిదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లలో పరాజయం పాలైన టీమిండియా, మూడో టెస్ట్ లో స్థాయికి తగ్గ ప్రతిభను కనపరిచి ఆదిత్య జట్టును మట్టికరిపించింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఏ దశలోనూ ఇంగ్లాండ్ కు ఒక్క అవకాశం కూడా టీమిండియా ఇవ్వలేదు.

521 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగవ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు తొలి సెషన్ లోనే 4 వికెట్లు కోల్పోయి, డిఫెన్స్ లో పడింది. ఆ తర్వాత బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. వీరిద్దరూ కలిసి 5 వికెట్ కు 169 పరుగులు జోడించగా, బూమ్రా అద్భుతమైన ఇన్ స్వింగర్ తో బ్రేక్ చేసాడు.

ఆ తర్వాత బూమ్రా మరింతగా చెలరేగి వరుసగా మరో రెండు వికెట్లను తీసుకోవడంతో ఇంగ్లాండ్ పరాజయం ఖాయమైంది. బ్రాడ్ – అబ్దుల్ రషీద్ ల ద్వయం కొంతసేపు అడ్డు తగిలినా, మరోసారి బంతిని అందుకున్న బూమ్రా ఈ ఇన్నింగ్స్ లో 5వ వికెట్ ను సొంతం చేసుకున్నాడు. అయితే విజయానికి ఒక్క వికెట్ దూరంలో టీమిండియా నిలిచింది.