India-test-Matchరాజ్ కోట్ వేదికగా వెస్టీండీస్ తో ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ ను టీమిండియా మూడు రోజుల్లోనే ముగించేసింది. తొలి ఇన్నింగ్స్ లో 649 పరుగుల భారీ స్కోర్ ను సాధించి డిక్లేర్ చేయగా, వెస్టీండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్పకూలగా, రెండవ ఇన్నింగ్స్ లోనూ 196 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

దీంతో 272 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ 4 వికెట్లతో విండీస్ బ్యాట్స్ మెన్లను పెవిలియన్ కు పంపగా, రెండవ ఇన్నింగ్స్ లో కులదీప్ యాదవ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ సెంచరీ చేసిన పృధ్వీ షాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

టీమిండియాకు అయితే ఘనవిజయం దక్కింది గానీ, వీక్షకులకు మాత్రం కిక్ లేకుండా పోయింది. విండీస్ బ్యాట్స్ మెన్లు ఎలాంటి పోరాటపటిమను ప్రదర్శించకపోవడంతో చప్పగా ముగిసింది. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ విజయం సాధించడంతో, సిరీస్ నైతే టీమిండియా కోల్పోయే ప్రమాదం లేదు. రెండవ టెస్ట్ మ్యాచ్ 12వ తేదీన హైదరాబాద్ వేదికగా జరగనుంది.