india-pak-roadబోర్డర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలను ఇండియా కూడా సీరియస్ గా తీసుకోవడంతో… బోర్డర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ కున్న ట్రాక్ రికార్డ్ రీత్యా ఎటు వైపు నుండి వచ్చి దాడి చేస్తారో అన్న ఉద్దేశంతో… ఇస్రో సహాయంతో భారత సర్కార్ అన్ని యాంగిల్స్ లోనూ కనిపెట్టుకుని ఉంటోంది. ఈ క్రమంలో ఇండియా – పాకిస్తాన్ ల మధ్య గల రహదారికి సంబంధించి ఇస్రో ద్వారా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

ఆ రహదారి ఫోటోలు చూడముచ్చటగా ఉండడంతో… సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 2900 కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా 1,50,000 లైట్లు కనువిందు చేస్తున్నాయి. అద్భుతమనిపించే విధంగా ఉన్న ఈ రహదారిలో కూడా పాకిస్తాన్ దాడులు చేయవచ్చన్న సమాచారంతో ఇస్రో క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే, పాకిస్తాన్ వైఖరి దొడ్డిదారి కావడంతో… ఈ రహదారిలో ఎలాంటి హంగామా చేయకపోవచ్చన్న కౌంటర్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.
india-pak-road-isro