Gully Boy - India’s Oscar Dream Ends Earlyభారత్ కు ఆస్కార్స్ లో ఈ సారీ నిరాశే మిగిలింది. భారత్ నుండి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేషన్ గా పంపిన గల్లీ బాయ్ చివరి టాప్ 10లో నిలవలేదు. ఆస్కార్ అవార్డులకు ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల వివరాలను అకాడమీ లాస్‌ఏంజెలిస్‌లో ప్రకటించింది.

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద ఆస్కార్‌కు అర్హత సాధించిన 91 చిత్రాల్లో చివరకు కేవలం 10 మాత్రమే ఆస్కార్‌ బరిలో నిలిచాయి. పారాసైట్‌ (దక్షిణ కొరియా), లెస్ మిజరబుల్స్ (ఫ్రాన్స్), మరియు పెయిన్‌ అండ్‌ గ్లోరీ (స్పెయిన్) అనే సినిమాలు ఈ కేటగిరీలో ఫేవరైట్స్ అని అంటున్నారు.

కాగా ఫిబ్రవరి 9న ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం జరగనుంది. గ‌త ఏడాది నేష‌న‌ల్ అవార్డ్ పొందిన అస్సాం చిత్రం విలేజ్ రాక్ స్టార్స్ కూడా మ‌ధ్య‌లోనే ఆస్కార్ నామినేష‌న్స్ నుండి తొల‌గించ‌బ‌డింది. చాలా కాలంగా ఇండియా సినిమాలేవీ విదేశీ కేట‌గిరిలో క‌నీసం టాప్ టెన్లో కూడా నిల‌వేక‌పోతూ ఉన్నాయి.

మ‌న‌దేశం నుండి అమీర్ ఖాన్ న‌టించిన ల‌గాన్ చిత్రం చివరి సారిగా ఆస్కార్ టాప్ 10 నామినేషన్స్‌కి ఎంపికైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌రే సినిమా క‌నీసం ఆ స్థాయికి వెళ్లలేదు. అంత‌కు ముందు కొన్ని ద‌శాబ్దాల కింద‌ట మ‌ద‌ర్ఇండియా, స‌లాం బాంబే సినిమాలు ఆస్కార్ రేసులో టాప్ ఫైవ్ వ‌ర‌కూ వెళ్లి వ‌చ్చాయి.