india-england-test-series-3rd-day-towardsమూడవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అభిమానుల మాటలు ఇవి. అవును… కీలకమైన మూడవ రోజులో టీమిండియా అన్ని రంగాలలో విశేషంగా రాణించడంతో మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 271 పరుగులతో బరిలోకి దిగిన టీమిండియా, మరో 30 పరుగులు జోడించిన తర్వాత అశ్విన్ వికెట్ ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత జడేజాకు జతకలిసిన జయంత్ యాదవ్ అద్భుతంగా రాణించడంతో భారీ ఆధిక్యం సాధించగలిగింది.

జయంత్ 55, జడేజా 90 పరుగులతో రాణించడంతో 417 పరుగులకు ఆలౌట్ అయ్యి, 134 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని అందిపుచ్చుకుంది. ఇక, రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ కు కష్టాలు తప్పలేదు. స్పిన్నర్ అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను ఇండియా వైపుకు తిప్పేసాడని చెప్పవచ్చు. కుక్, అలీ, స్టోక్స్ వికెట్లను అశ్విన్ సొంతంగా చేసుకోగా, ఈ సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న బైర్ స్టోను జయంత్ యాదవ్ వెనక్కి పంపాడు.

దీంతో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 4 వికెట్లు కోల్పోయి 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకా 56 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉండడంతో వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయగలిగితే మ్యాచ్ భారత్ వశం అయినట్లే. అయితే కీలకమైన ఆటగాడు రూట్ ఇంకా క్రీజులో ఉండడంతో ఇంగ్లాండ్ ఆశలన్నీ రూట్ పైనే పెట్టుకుంది. అయితే పరిస్థితి చూస్తుంటే… ఇంగ్లాండ్ కు మరో పరాభవం తప్పేలా లేదని క్రీడా విశ్లేషకులు కూడా వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.