india-endland-test-series-vijay-pujara-highlightsటెయిల్ ఎండర్ బాల్ (31) అండతో బట్లర్ చెలరేగిపోవడంతో, తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఓ పక్కన వికెట్లు పడిపోతున్నా… బట్లర్ టీమిండియా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లు కొడుతూ చివరి వికెట్ గా 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లతో మరోసారి సత్తా చాటగా, జడేజా 4 వికెట్లతో భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.

ఇక, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్ రాహుల్ (24) వికెట్ ను 39 పరుగుల వద్దే కోల్పోయింది. దీంతో మరోసారి ఇన్నింగ్స్ ను సరిదిద్దే బాధ్యతను మురళీ విజయ్, పుజారాలు అందుకున్నారు. మురళీ విజయ్ చూడచక్కని షాట్లు ఆడుతూ అర్ధసెంచరీ పూర్తి చేయగా, పుజారా అర్ధ సెంచరీకి చేరువగా వచ్చాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లతో క్రీజులో విజయ్ 70, పుజారా 47 పరుగులతో ఉండడంతో మూడవ రోజు భారీ స్కోర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.