India Beat Pakistan  U-19 World Cup Semi Finalఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్ లో తలపడిన ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య ‘వార్ వన్ సైడ్’ అయ్యింది. దాయాది దేశాల పోరు కావడంతో… అండర్ 19 మ్యాచ్ అయినప్పటికీ, ఎంతో ప్రాధాన్యతను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 272 పరుగుల భారీ స్కోర్ చేస్న్ది. బ్యాటింగ్ విభాగంలో శుబ్మన్ గిల్ (102) అజేయమైన సెంచరీ చేయగా, ఓపెనర్లు షా (41), కలరా (47) కూడా రాణించారు.

ఇక భారీ లక్ష్య చేధనలో పాకిస్తాన్ జట్టు చేతులేత్తేసింది. మొత్తం పదకొండు మంది బ్యాట్స్ మెన్లలో ముగ్గురు మాత్రమే రెండెంకల స్కోర్ ను అందుకున్నారంటే ఎంత పేలవంగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 29.3 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పోరెల్ 4 వికెట్లతో సత్తా చాటగా, శివ సింగ్, పరాగ్ లు చెరో 2 వికెట్లు తీయడంతో, 203 పరుగులతో తేడాతో ఘనవిజయం అందుకుంది.

దీంతో శనివారం నాడు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు ఇండియా సిద్ధమైంది. అండర్ 19 వరల్డ్ కప్ ను ఇప్పటికే మూడు సార్లు కైవసం చేసుకున్న ఇండియా, ఆరవసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి మరోసారి వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా యువకెరటాలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే ఆసీస్ ను నిలువరించడం పెద్ద కష్టమైన విషయమీమి కాదు.