India beat Bangladesh- Nidahas Trophyబంగ్లాదేశ్ పై జరిగిన ఫైనల్లో అవలీలగా గెలుస్తుందని భావించిన టీమిండియా, చివరి ఓవర్ చివరి బంతి వరకు చేరుకోవడానికి గల ప్రధాన కారణాలలో బంగ్లాదేశ్ బౌలర్ల ప్రతిభ ఎంత ఉందో, టీమిండియా నుండి విజయ్ శంకర్ అంతకంటే ఎక్కువ పాత్రను పోషించాడు. ఓవర్ కు 10 పరుగుల తరపున చేయాల్సిన తరుణంలో…. 18వ ఓవర్ వేసిన రహీం వేసిన ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగును చేసి, పరోక్షంగా మనీష్ పాండే అవుట్ కు కారణమయ్యాడు.

దీంతో విజయ్ శంకర్ స్ట్రైకింగ్ కి వస్తుంటే… ప్రేక్షకులలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీసం ప్రజన్స్ ఆఫ్ మైండ్ ను కూడా ఉపయోగించకుండా, ప్రతి బాల్ ను గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తూ. బ్యాట్ కు, బంతికి సంబంధం లేకుండా ఆడి, మ్యాచ్ ను రసకందాయంలో పడేసాడు. దినేష్ కార్తీక్ అద్భుతమైన బ్యాటింగ్ పుణ్యమా అని టీమిండియా గెలిచింది గానీ, ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే, విజయ్ శంకర్ విమర్శల వర్షం ఒక రేంజ్ లో వచ్చి ఉండేది.

ఇంతటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించిన ఈ విజయ్ శంకర్ అసలెవరూ? అని వెతికే పనిలో నెటిజన్లు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వెలుగులోకి వచ్చిన విజయ్ శంకర్, గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్ ను దినేష్ కార్తీక్ కంటే ముందుగా బ్యాటింగ్ ఆర్డర్ లో పంపిన నిర్ణయం తనదేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకున్నాడు. ఏప్రిల్ 7వ తేదీ నుండి ప్రారంభం కాబోతోన్న ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున బరిలోకి దిగనున్నాడు విజయ్ శంకర్.