Income Tax raids on Rashmika Mandannaనాగశౌర్య, విజయ్ దేవరకొండ వంటి యువ హీరోలతో సినిమాలు చేసిన కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ లెవెల్ కి ఎదిగింది. ఆమె ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూలో హీరోయిన్ గా నటించింది. సక్సెస్ తో పాటు ఇన్కమ్ టాక్స్ కష్టాలు కూడా వచ్చి పడ్డాయి ఈ భామకు.

రష్మిక ఇంటిపై ఐటి దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక లోని కొడగు జిల్లా విరాజ్ పేటలోని రష్మిక ఇంట్లో ఈరోజు ఉదయం నుండీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. సినిమాల నుండి వచ్చే ఆదాయం మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల నుండి వచ్చే ఆధాయం ఆమెకు తక్కువ చేసి చూపిస్తున్నారని అభియోగం.

ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఆమె ఇంట్లో లేనట్టు సమాచారం. అందుబాటులో ఉన్న వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సరిలేరు నీకెవ్వరూ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద స్ట్రాంగ్ గా ముందుకు సాగుతుంది. సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా మీద దాదాపుగా 110 కోట్ల బిజినెస్ జరిగింది.

అయితే సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఆమె ఆ పాత్రలో ఓవర్ యాక్షన్ చేసిందని విమర్శించారు. అయితే ఆమె పాత్ర మేరకు అలా నటించిందని, అనిల్ రావిపూడి తన చిత్రాలలో హీరోయిన్ల పాత్రలు అలాగే ఉంటాయని మరి కొందరు సమర్థిస్తున్నారు. ముఖ్యంగా మీకు అర్ధమవుతుందా అనే ఆమె మేనరిజం అదిరిపోయిందని వారు అంటున్నారు.