న్యాచురల్ స్టార్ నాని ఈరోజు ఉదయం అనుకోని అతిథిలు రాకతో నిద్రలేచారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈరోజు ఆయన తలుపు తట్టారు. జూబ్లీహిల్స్ లోని ఆయన కార్యాలయాలు, ఇల్లుతో పాటు పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తనిఖీలలో కీలక పాత్రలను స్వాదీనం చేసుకుని వాటిపై విచారిస్తున్నట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం. ఇటీవలే వారు నానితో జెర్సీ అనే సినిమా తీశారు. నాని ఈ సినిమా లాభాలలో వాటా తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ లో వదంతులు వ్యాపిస్తున్నాయి.
టాలీవుడ్ లో బిజీ యాక్టర్స్ లో నాని ఒకరు. ఒక్కో సినిమాకు దాదాపుగా 10 కోట్ల వరకు తీసుకుంటారని అంచనా. సంవత్సరానికి మూడు సినిమాలు సైన్ చేసి దాదాపుగా 30 కోట్లు వెనకేస్తారట. దానితో ఆదాయ పన్ను శాఖ వారి కన్ను ఆయన మీద పడింది. ప్రస్తుతం ఆయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వీ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాలో నాని నెగటివ్ పాత్ర చెయ్యబోతున్నాడని సమాచారం. నాని కేరీర్ లో ఇది 25వ చిత్రం. మర్చి 25, 2020న ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు ఆయన నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ తో ఇంకో సినిమా సైన్ చేశారని వార్తలు వస్తున్నాయి.
F3 Review – Over the Top but Faisa Vasool
Chay’s Dialogue Targeted at His Ex-wife?