income-tax-raids-asian-cinemas-officesనైజాంలో ప్రముఖ సినిమా పంపిణీ సంస్థ, ఏషియన్‌ సినిమాస్ ఇప్పుడు ఆదాయ శాఖ దాడులు ఎదురుకుంటుంది. ఏషియన్‌ సినిమాస్‌’ అధినేతల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఏషియన్‌ సినిమా అధినేతలు నారాయణదాస్‌ నారంగ్‌, సునీల్‌ నారంగ్‌ ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

వారి ఇళ్లల్లో కీలకమైన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.చాలా ఏళ్ళ గా సినిమాల పంపిణీదారుగా ఉన్న ఈ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ పేరిట థియేటర్లు కూడా ఉన్నాయి. మొన్న ఈ మధ్య సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలిసి ఏఎంబీ మాల్‌ను ఇదే సంస్థ ఏర్పాటు చేసింది. ఐటీ సోదాల్లో భాగంగా కొండాపూర్‌లోని ఏఎంబీ సినిమాస్‌లోనూ అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు.

లాభాలను తక్కువగా చూపించి పన్ను ఎగ్గొట్టారని వారు ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ మధ్యనే ఏషియన్‌ సినిమాస్ సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టి, హీరో సరిగా లేడు అనే కారణంగా ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు.

ఇప్పుడు అదే స్క్రిప్టును యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిలతో సినిమాగా తీస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కానున్నట్టు సమాచారం. దీపావళికి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.