Income Tax in union budget 2020ఆదాయ పన్ను చెల్లింపు కోసం ఇకపై రెండు విధానాలు అమల్లోకి ఉంటాయని, పాతవిధానంలో కొనసాగితే ఇప్పటివరకు ఉన్న మినహాయింపులు యథాతథంగా అమల్లో ఉంటాయని, కొత్త విధానంలోకి మారితే మినహాయింపులు ఏవీ ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు.

కొత్త విధానంలో పాత విధానంతో పోలిస్తే పన్ను తక్కువగా ఉంటుంది. కొత్త విధానంలో రూ. 5 లక్షల నుంచి 7 లక్షల ఆదాయానికి 10శాతం పన్ను, రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయానికి 15శాతం పన్ను, రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల ఆదాయానికి 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయానికి 25శాతం పన్ను, రూ. 15 లక్షలకుపైగా ఆదాయానికి 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.

అయితే మినహాయింపులు లేకపోవడంతో అసలు బెనిఫిట్ లేకపోవడం లేదా చాలా తక్కువగా బెనిఫిట్ ఉండడం జరగబోతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అయితే ఏదో చేశాం అని చెప్పుకోవడానికి ఇది అంకెల గారడీ మాత్రమే అంటున్నారు. అయితే నిపుణులు మాత్రం దీనిలో ఇంకో లొసుగు ఉండవచ్చు అంటున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కడా పన్ను మినహాయింపులు ఉండవు… బహుశా ప్రభుత్వం కూడా అదే దిశగా సాగుతుంది. అయితే ఒకేసారి పన్ను చెల్లింపుదారులకు షాక్ ఇవ్వకుండా ఆ డైరెక్షన్ లో మొదటి స్టెప్ అంటున్నారు. అదే అయితే మధ్య తరగతికి రానున్న రోజులలో ఇబ్బందే.