illegal affair allegations on MLA rojaచీరాలలో టీడీపీ సీనియర్ నేత కరణం బలరామ్ ను బరిలో దింపడంతో స్థానిక ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ కు ఊపిరి సలపడం లేనట్టు ఉంది. సర్వేలన్నీ బలరామ్ కు అనుకూలంగా ఉండడంతో ఆయన కొత్త పుంతలు తొక్కుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్వాక్రా పసుపు కుంకుమతో టీడీపీకి అనుకూలంగా ఉన్న మహిళలను దూరం చెయ్యాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది.

“నంద్యాల ఉప ఎన్నిక సమయంలో గెలుపుకోసం సీఎం నీచస్థాయికి దిగారు. అ సమయంలో నాటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీయడానికి నీచానికి దిగారు. అక్కడ ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రోజాతో భన్వర్‌లాల్‌కు అక్రమ సంబంధం అంటగట్టాలని, ఆ మేరకు ప్రచారం చేయాలని నాడు ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జులుగా వ్యవహరించిన నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు.ఈ మేరకు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లోనే ఆదేశించిన నీచుడు చంద్రబాబు’’అని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమంచి చెప్పింది నిజమే అనుకుందాం. కాకపోతే నంద్యాల సందర్భంగా కానీ ఆ తరువాత గానీ టీడీపీ ఎక్కడా అటువంటి విమర్శలు చెయ్యలేదు. అసలు అటువంటి విషయం ఏదీ జనాప్రాబల్యంలో లేదు. చంద్రబాబు ఆదేశించి ఉంటే మంత్రులు పాటించే వారు కదా? చంద్రబాబు నీచుడు అంటూ ఇప్పుడు చెబుతున్న కృష్ణ మోహన్ అలా చెప్పిన తరువాత కూడా టీడీపీలో ఎందుకు కొనసాగారు? వైకాపాలో చేరే ఒక్క రోజు ముందు కూడా చంద్రబాబుని కలిశారు కదా? ఇప్పుడు ఎన్నికల కోసం ఒక మహిళను అడ్డుపెట్టుకుంది ఎవరు?