నందమూరి బాలయ్య 99వ చిత్రం ‘డిక్టేటర్’ చిత్రాన్ని దర్శకుడు శ్రీవాస్ భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలు అంజలి మరియు సొనాల్ చౌహాన్లు నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు సినిమాకు మరింత గ్లామర్‌ను అద్దేందుకు దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రంలో గోవా హాట్ బ్యూటీ ఇలియానాతో ఐటెంసాంగ్ చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగి, అదే సమయంలో బాలీవుడ్ వెళ్లిన ఇలియానా గత కొంత కాలంగా సౌత్‌లో రీ ఎంట్రీ కోసం తాపత్రయ పడుతోంది. ‘బ్రూస్లీ’ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది. తాజాగా ‘డిక్టేటర్’ చిత్రం కోసం ఈమెను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘డిక్టేటర్’ చిత్రానికి ఇలియానా ఐటెం సాంగ్ తప్పకుండా హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.