Ileana D'Cruzనెటిజన్లకు కన్నులవిందైన ఫోటోలను అందించడంలో ఎప్పుడూ గోవా బ్యూటీ ఇలియానా ముందుంటుంది. ఆ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన పిక్ ఒకటి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో కొండల నడుమ సముద్ర తీరం… ఫోర్ గ్రాండ్ లో స్విమ్మింగ్ పూల్… అందులో ఇలియానా..!

ఇక చెప్పేదేముంది… వీక్షకులను తన అందచందాలతో కట్టిపడేయడమే కదా ఈ బ్యూటీకి వచ్చింది. పింక్ కలర్ టాప్ లో ఇలియానా మెరిసిపోతూ దర్శనమిస్తోంది. తన భర్త తీసిన ఈ ఫోటోకు ఇప్పటివరకు 7 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయంటే ఏ స్థాయిలో ఈ ఫోటో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో టాప్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు మరి!

Chillin’ 📸 @andrewkneebonephotography ♥️

A post shared by Ileana D'Cruz (@ileana_official) on