Ileana D Cruz Item song in Ram charan Vianaya Vidheya Ramaఅందాల సుందరి ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆమె అందాలతో కుర్ర కారుల మనసుల్ని దోచేసింది. ఇక ఆమె నడుము వంపులకు ఫిదా అవ్వని వారు లేరు. మరి అలాంటి ముద్దుగుమ్మ సడన్ గా తెలుగు సినిమాలను వదిలేసి బాలీవుడ్ జంప్ అయిపోయింది. అయితే తొలుత కొత్త ప్లేస్ బాగానే ఉన్నా,ఆ తర్వాతే పాపం ఆ ప్లేస్ బోర్ కొట్టేసింది అనుకుంట సడన్ గా మళ్లీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. అయితే ఈ క్రమంలోనే రవి తేజతో ఆమె చేసిన “అమర్-అక్బర్-అంథోనీ” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయినా ఈ అమ్మడు అసలు ఎక్కడా తగ్గడం లేదుగా. ఏ నిర్మాత ఆఫర్ ఇచ్చినా భారీగానే డిమాండ్ చేస్తుందట.

తాజాగా మన చెర్రీ వినయవిధేయరామ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇలియానా అయితే బావుంటుంది అని భావించిన నిర్మాత, దర్శకులు ఆమెను ఆశ్రయించగా, ఈ ఒక్క స్పెషల్ పాటకే దాదాపుగా 60 లక్షలు అడిగినట్లు భోగట్టా. ఆమె డిమాండ్ కి షాక్ అయిన దర్శక నిర్మాతలు చేసేది ఏమీ లేక, వేరే ఆప్షన్స్ వెతుక్కోక తప్పడం లేదు. అయితే ఒక పక్క రవితో నటించిన తన కమ్ బ్యాక్ సినిమా టాలీవుడ్ లో డిజాష్టర్ గా నిలిచింది, మరి పక్క చేతిలో సినిమాలు లేవు, అయినా ఈ ముద్దుగుమ్మ అసలు ఎక్కడ తగ్గడం లేదు. ఇలానే డిమాండ్ చేస్తే ఇక దర్శక నిర్మాతలు ఆమెను ఖచ్చితంగా దూరం పెడతారు అని చెప్పక తప్పదు.

అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు మార్కెట్ లేదు, అయినా అంత డిమ్యాండ్ చేస్తుంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అందుకే నిర్మాత దానయ్య, దర్శకుడు బోయపాటి కూడా లైట్ తీసుకుని ఆ పాటకు రకుల్ ని పెట్టుకుని బండి లాగించేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే, రకుల్ చెర్రీకి మంచి ఫ్రెండ్, ఆ రకంగా తాము అనుకున్న బడ్జెట్ లో అయినా ఈ పాటను పూర్తి చెయ్యవచ్చు అన్నది వారి ఆలోచన.