Revanth Reddy Becomes A Headache for Chandrababuస్వీడన్ కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్, ఐకియా ఎల్లుండి తన కార్యకలాపాలు మొదలు పెట్టబోతోంది. దీనిపై అన్ని వర్గాలలోనూ ఎంతో ఆసక్తి ఉంది. అయితే ఈ సంస్థకు ఐటీ కంపెనీలు ఉండే హైటెక్ సిటీలో పదహారు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు.

ఈ స్థలాన్ని ఐకియా ఇండియాకు ప్రభుత్వం ఏకపక్షంగా కేటాయించిందని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు.ఇది ఫర్నిచర్ షాపు మాత్రమేనని, దీనిని ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చని ఆయన తెలిపారు. టెండర్లు ఆహ్వానించకుండానే కేటాయింపులు జరిపారని.. దీంతో ప్రభుత్వానికి 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రేవంత్‌ ఫిర్యాదు చేశారు.

ఈ కేటాయింపులను నామినేషన్‌ పద్ధతిలో చేశారని.. ఇది చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఐటీ కంపెనీలు, దాని ఆధారిత కంపెనీలకే భూమి కేటాయించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా ఐకియాకు కేటాయింపులు జరిగాయని రేవంత్‌ పేర్కొన్నారు. ఒకవేళ ఆయన కోర్టు నుండి వ్యతిరేక ఉత్తరువులు పొందగలిగితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది