If NTR Wants to come Cadre says No Need2014 తరువాత లోకేష్ ని తెరమీదకు తెచ్చారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ ని చేసి మంత్రి చెయ్యడంతో లోకేష్ క్యారెక్టర్ హననం చేసింది ప్రతిపక్షం… లోకేష్ ని పప్పు అంటూ తూలనాడుతూ ప్రజలలో పలచన చేశారు. అది ఎన్నికలలో ఉపయోగపడింది కూడా.

అధికారంలో ఉండగా పెద్దగా పట్టించుకోని లోకేష్ ఎన్నికల ఓటమి తరువాత సీరియస్ గా తీసుకుని తన పర్సనాలిటీ, స్పీచ్లను బాగా ఇంప్రూవ్ చేశారు. ఎక్కడ సమస్య ఉన్నా చంద్రబాబు కంటే కూడా లోకేష్ ముందుండి క్యాడర్ లోకి వెళ్తున్నారు.

ఇప్పటివరకు పప్పు అంటూ తేలికగా తీసుకున్న అధికార పార్టీ వారు కూడా ఇప్పుడు లోకేష్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. వారు సీరియస్ గా తీసుకుంటున్నారు అనే కంటే లోకేష్ తని తాను సీరియస్ గా తీసుకునేలా చేసుకున్నాడు అనొచ్చు.

చంద్రబాబు నాయుడు తరువాత పార్టీ పరిస్థితి ఏమిటి అనే దాని మీద గతంలో టీడీపీ క్యాడర్ లోనే ఒక అనుమానం ఉండేది. లోకేష్ మీద ఉన్న అనుమానాల కారణంగా వారు ఎంతో మదనపడేవారు. అయితే ఇప్పుడు వారిలో కూడా లోకేష్ భరోసా నింపారు అని చెప్పుకోవచ్చు.

లోకేష్ మీద అనుమానంగా ఉన్న సమయంలో సహజంగానే అందరి చూపు ఎన్టీఆర్ మీద ఉండేది. అది సహజం కూడా. అయితే లోకేష్ ఇలానే ఇంప్రూవ్ అయితే ఎన్టీఆర్ గురించి క్యాడర్ ఆలోచించే పరిస్థితి ఉండదని కొందరి అభిప్రాయం. కొందరైతే ఏకంగా అప్పుడు ఎన్టీఆర్ వస్తామన్నా అక్కర్లేదని క్యాడరే అంటాదంట.