ide-kalala-vunnadhe-full-video-song-bharat-ane-nenuప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “భరత్ అనే నేను” సినిమా నుండి వీడియో సాంగ్స్ రిలీజ్ వెల్లువ కొనసాగుతోంది. ఇటీవలే ‘ఐ డోంట్ నో’ సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ‘అరెరే ఇది కలలా ఉన్నదే’ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. ఆడియో సాంగ్ లో నాలుగున్నర్ర నిముషాలు ఉన్న ఈ పాటను సినిమాలోకి వచ్చేపాటికి ఓ నిముషంన్నర్ర నిడివి కట్ చేసారు. ఆ కట్ చేసిన సాంగ్ నే యాజిటిజ్ గా రిలీజ్ చేసారు. ఈ పాటలో మహేష్ బాబు మీసకట్టుతో కనిపించడం హైలైట్ అయ్యింది.

ధియేటర్ లో మొదటిసారి చూసినపుడు అభిమానులకు అచ్చం సూపర్ స్టార్ కృష్ణను చూసినంత అనుభూతికి గురయ్యారు. అలాగే ఈ పాటలో కైరా స్టెప్పులు, అందం యువతను విశేషంగా ఆకట్టుకుంది. దేవిశ్రీ రెగ్యులర్ బీట్ అయినప్పటికీ, కధను ముందుకు నడిపించే విధంగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించడంతో సినిమాతో పాటుగా ఈ పాట నడుస్తుంది. సినిమాలో ఉన్న మూడు పాటలు విడుదల కావడంతో, ‘భరత్ అనే నేను’లో హైలైట్స్ గా నిలిచిన ‘థీమ్ సాంగ్’ మరియు ‘వచ్చాడయ్యో సామి’ పాటలు ఇంకా మిగిలి ఉన్నాయి.