iddari-lokam-okate-trailerరాజ్ తరుణ్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ నెల 20న పెద్ద సినిమాల హడావిడి తరువాత క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

కథ విషయానికి వస్తే ఒకేసారి పుట్టి పెరిగిన ఒక ఆడా మగ, కలిసి పెరిగి ఆ తరువాత 18 ఏళ్ల పాటు విడిపోతారు. ఆ తరువాత వారు కలుస్తారు. ఒకరి కంపెనీని ఇంకొకరు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే సరిగా హీరో ప్రపోస్ చేసే సరికి మాత్రం హీరోయిన్ తనకు ఆ ఫీలింగ్ లేదు అంటుంది. దీనితో వారి కథ ఏమవుతుందని అనేది అసలు స్టోరీ.

కథ చాలా రొటీన్ గా అనిపిస్తున్నా దర్శకుడు హీరో హీరోయిన్ల మధ్య జరిగే మొమెంట్స్ క్యూట్ గా చూపించాడు. అవి సినిమాలో వర్క్ అవుట్ అయ్యి ఆ తరువాత కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కూడా బాగా డీల్ చేస్తే సినిమా వర్క్ అవుట్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి మాత్రం సినిమా మీద ఎటువంటి హైప్ లేదు. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఆడు మగాడ్రా బుజ్జి ఫేం జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు సినిమా కావడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.