Hero Uday Kiran held for misbehaviourదసపల్లా హోటల్ మూన్ పబ్ లో జరిగిన ఉదంతంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన టాలీవుడ్ వర్ధమాన నటుడు ఉదయ్ ఈ ఘటనపై స్పందించారు. తనపై తెలుగుదేశం రాజకీయ నేతలు ఇద్దరు కుట్రలు పన్ని తన పేరును ఇరికిస్తున్నారని, అందులో ఒకరు మంత్రి అనుచరుడు కూడా ఉన్నారని, మరొకరు తెలంగాణా తెలుగుదేశం నేత అని ఆరోపణలు చేసారు.

‘ఐ లవ్ జగన్… ఐ లవ్ కేసీఆర్…’ వారిద్దరి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని, ఈ ఘటనపై కేసీఆర్ అంకుల్ ని కలవడానికి వెళ్తున్నానని, అలాగే కళ్యాణ్ గారిని కూడా కలుస్తానని, డీజీపీ వద్దకు వెళ్లి కేసులు పెడతానని, నేను సినిమా వాడిని, రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు… అంటూ ఆగ్రహపూరితమైన వ్యాఖ్యలు చేసారు.

నా సంఘటనలతో సినిమా ఇండస్ట్రీ వారికి ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ ఉదంతం గానీ, ఏదైనా అది నా వ్యక్తిగతం వరకేనని, అయినా డ్రగ్స్ కేసులో ఇండియాలోనే అత్యంత వేగంగా బెయిల్ తనకు మంజూరు అయ్యిందని, ఈ ఆరోపణలన్నీ ఆ ఇద్దరు నాయకులే చేస్తున్నారని పరోక్షంగా తెలంగాణాలో ఉన్న ఏకైక తెలుగుదేశం పార్టీ నేతను దుయ్యబట్టే ప్రయత్నం చేసారు.