i-am-rashmi-gautam-not-reshmi‘జబర్దస్త్’షో తో పాటు బుల్లితెరపై మరిన్ని షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న రష్మి గౌతమ్, సిల్వర్ స్క్రీన్ పై కూడా అప్పుడప్పుడు తళుక్కుమంటున్న విషయం తెలిసిందే. అయితే స్మాల్ స్క్రీన్ ఇచ్చినంత గుర్తింపు సిల్వర్ స్క్రీన్ ఇవ్వకపోవడంతో, ఎక్కువగా బుల్లితెరనే నమ్ముకున్న ఈ బ్యూటీ, తాజాగా తన పేరును తానే ‘హ్యాష్ ట్యాగ్’ చేసుకుంటూ… అందుకు గల కారణాన్ని తెలిపింది.

“రష్మి గౌతమ్” నా పేరును నేనే హ్యాష్ ట్యాగ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను “రేష్మి”ని కాదు కాబట్టి, అంటూ తన పేరుపై వివరణ ఇచ్చుకుంది. ఇటీవల జరిగిన ఓ షోలో కూడా తన పేరుపై స్పష్టమైన ప్రకటన చేసిన రష్మి, తాజాగా మళ్ళీ తన పేరును ప్రకటించుకుందంటే… పేరును కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లుంది. మరి తప్పుగా పలుకుతున్న వారు రష్మి గౌతమ్ ను సరిగా గుర్తించారో లేదో మరి!