Hyderabad rains effects the common man lifeహైదరాబాద్‌ నగరంలో సోమవారం భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్థంబించిపోయింది. అనుకోకుండా కురిసిన వాన అవ్వడంతో అధికారులు సరైన చర్యలు చేపట్టలేక పోయారు. ప్రజల నుండి వచ్చిన నెగేటివ్ ఫీడ్‌బ్యాక్ తో గవర్నమెంట్ కదిలింది. చేపట్టాల్సిన సహాయక చర్యలపై సచివాలయంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు.

140 మన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, 50 స్టాటిక్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధం చేశారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం ద్వారా పరిస్థితులను పర్యవేక్షించారు. ఐతే వాన దేవుడు రూటు మార్చి ఒక మోస్తరు వర్షంతో సరిపెట్టారు. పూర్తిగా రెడీ అయ్యాక తుస్సు మనిపించారు.

ఐతే రాబోయే రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. తద్వారా సోమవారం వచ్చిన .అపఖ్యతి పోగొట్టుకోవాలని ప్రభుత్వ పెద్దల ఆరాటం. ఐతే వరుణ దేవుడి ప్లాన్ ఏంటో మరి! వారికి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి!