Hyderabad Rains KCR KTR Response హైదరాబాద్ లో భారీ వర్షం అనే వార్త వినిపిస్తే చాలు అటు ప్రజల్లోనూ పాలకుల్లోనూ గుభులు మొదలవుతుంది, కారణం నగరంలోని అరివీర భయంకరమైన రోడ్లు. ఒక మాదిరి వర్షానికే చెరువులను తలపిస్తాయి మన భాగ్యనగర రోడ్లు. అటువంటిది సోమవారం రాత్రి నగరంలో అత్యంత భారీ వర్షం దానితో పాటే జనాల ఇక్కట్లు. ఒక్కసారిగా జనజీవనం స్థంబించిపోంది.

మోకాళ్ళ లోతు నీళ్ళు, ఎక్కడ ఉంటాయో ఉందావో తెలీని గుంతలు, కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ల్ వెరసి సగటు నగర జీవీ రోడ్డు ప్రయాణం ఇహలోక నరకాన్ని తలపించింది. తెలంగాణా రావడంతోటే మన జీవితాలు మారిపోతాయి అని ఇచ్చిన హామీలు రోడ్డ్ల రూపంలో ప్రజలను వెక్కిరిస్తున్నాయి.

ఐతే ఏలీనా వారు ఎప్పటిలాగే అధికారులను అప్రమత్తం చేసి, ప్రజలను ఇళ్లలోనే ఉండమని సలహా ఇచ్చారు. రేపు వాన వెలుస్తుంది జనాలు బ్రతుకు జట్కా బండితో బిజీ ఐపోతారు అని వారి నమ్మకం కావొచ్చు. ఐతే ఓటరు కన్నెర్రజేస్తే ఏమావ్తుందో కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికి తెలియదు. ‘గత పాలకుల నిర్వాకం’ లాంటి కబుర్లు జనాలు ఎక్కువ కాలం హర్షించరు. బంగారు తెలంగాణా కాకపోయినా కనీసం గుంతలు లేని రోడ్డ్లు గల తెలంగాణా కోరుకోవడం ఏమాత్రం తప్పు కాదు. అది వారి కనీస హక్కు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికైనా మేల్కోనకపోతే తగిన మూల్యం చెలించక తప్పదు. రాజకీయాలు కాసేపు పక్కన పెడితే ఆఫీసుకు వెళ్ళేటప్పుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మీ నడుము బద్రం.