Hyderabad Metro Rail Officials clarifies on Metro Pillar  break rumoursనగరంలోని ఐఎస్‌బీ-గచ్చిబౌలి మార్గంలో మెట్రో పిల్లర్‌లో పగుళ్లంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నగర ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీనితో రంగంలోకి దిగి వాటిని ఖండించారు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి. అసలు ఆ మార్గంలో మెట్రో లైనే లేదని క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌ మెట్రోకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ పుకార్లుపై మంత్రి కేటీఆర్‌ కూడా వివరణ ఇచ్చారు. వైరల్‌ అవుతున్న ఫోటో హైదరాబాద్‌లోనిది కాదని.. పెషావర్‌లోని మెట్రో పిల్లరని తెలిపారు.

హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లు వేల టన్నుల బరువు, భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించామని స్పష్టం చేశారు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత హైదరాబాద్‌ మెట్రోరైలు నవంబర్‌ 29న నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన రోజునుండి ఒక్కరోజు కూడా లక్ష మందికి తక్కువ కాకుండా ప్రయాణం చేసి రికార్డు సృష్టించారు.