hyderabad isis terroristsఐఎస్ఐఎస్ పడగనీడలో ‘ఉమ్మడి రాజధాని’ హైదరాబాద్ వున్నట్లు సమాచారం. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్‌‌లో ఐఎస్ సానుభూతి పరులుగా చెబుతున్నవారు కనీసం 60 మంది వరకు వున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టుల మాదిరిగా వీళ్లు నేరుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా వున్నట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు నిర్వహించిన నిఘాలో ఈ 60 మందిని గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. వీళ్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఈ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర హోంశాఖకు ఓ నివేదిక సమర్పించిందని, అందులో కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలిసింది.

కాగా ఉగ్రవాద కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన 19 మంది తెలంగాణ యువతీయువకులను గుర్తించిన నిఘా వర్గాలు, వీరిలో 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముషీరాబాద్ ప్రాంతానికి టెక్కీ మునవాద్ సల్మాన్, ఐసిస్ తరపున పోరాడేందుకు ఇరాక్ వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దుబాయ్ కేంద్రంగా సామాజిక మాధ్యమాల ద్వారా క్యాంపెయిన్ చేస్తున్న అఫ్సాజబీన్‌ను ఆమె సహచరుడు సల్మాన్ మోహియుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.