Hyderabad High Courtతెలంగాణాలో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలుకావడంతో రాజకీయ లబ్ది కోసం బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికోసం ఎప్పటినుండో పట్టించుకోని హైకోర్టు విభజన అంశాన్ని తెర మీదకు తెచ్చింది. హైకోర్టును విభజించి తెలంగాణలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి కేంద్రం అడుగులు వేస్తోంది.

ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రింకోర్టులో ఎస్.ఎల్.పి వేయడంతో దీనిపై ఊహాగానాలు వస్తున్నాయి. ఎపి హైకోర్టు ఎపి భూ భాగంలోనే ఉండాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది.దాంతో కేంద్రం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని విభజన చేయడంలో జాప్యం జరుగుతోందని చెప్పేది. అయితే ఇప్పుడు ఆ తీర్పును సవరించాలని కేంద్రం కోరుతుంది.

ఇప్పుడు సుప్రింకోర్టు అంగీకరిస్తే ప్రస్తుతానికి ఎపి హైకోర్టు కూడా హైదరాబాద్ లోనే ఉండేలా చర్య తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహం ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు అమరావతిలోని తాత్కాలిక హై కోర్టు భవనాలు జనవరికి అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది. అయితే ఈ లోగానే తెలంగాణాలో ఎన్నికలు ఉండటంతో కేంద్రం తొందర పడుతుంది.